ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 24
తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో చిన్నపాటి సాగునీటి వనరుల పునర్వ్యవస్థీకరణ చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు మరియు చెరువుల మట్టి తొలగింపు అంశాలపై రూపొందించిన సమగ్ర నోట్‌ను గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కమిషన్ సమర్పించింది.
ఈ నేపథ్యంలో, కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి నాయకత్వంలో సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రతినిధులు మరియు నిపుణులతో పలు సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాల్లో చెరువుల పరిరక్షణకు స్థిరమైన వ్యవస్థ అవసరం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు డిసిల్టింగ్ ప్రాముఖ్యత వంటి అంశాలపై సవివరంగా చర్చించారు.సమావేశాల్లో జరిగిన చర్చల ఆధారంగా, చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటు మరియు డిసిల్టింగ్ కార్యక్రమాల అమలుకు సంబంధించిన సమగ్ర నివేదికను కమిషన్ రూపొందించి, గౌరవ మంత్రివర్యులకు సమర్పిస్తూ తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది.
ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కేవీ నర్సింహ రెడ్డి , భవాని మరికంటి గడుగు గంగాధర్ , సునీల్ , రాంరెడ్డి గోపాల్ రెడ్డి , మెంబర్ సెక్రటరీ గోపాల్ మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.చెరువుల పరిరక్షణ మరియు సమర్థవంతమైన నీటి వినియోగం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిషన్ పేర్కొంది.















