EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చిలుకు స్వామిని శ్రమశక్తి పురస్కారం తో సన్మానించిన మంత్రి గడ్డం వివేక్

ఈతరం భారతం హైద్రాబాద్ మే 1():

మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శ్రమశక్తి పురస్కారాలలో  సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రధానము జరిగింది. ఆలేరు మండలం షారాజిపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన రక్తదానము శ్రమదానము శిబిరాలు నిర్వహిస్తూ గ్రామ యువకులను సికింద్రాబాద్ రైల్వే కార్మికులను సమాజ సేవ పట్ల చైతన్య పరుస్తున్నారు. వీరిసేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది.

చిలుక స్వామికి ఈ గౌరవము లభించడం పట్ల పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. తన ఆ శ్రమను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారంతో సన్మానించడం పట్ల డాక్టర్ చిలుకు స్వామి ప్రభుత్వానికి రైల్వే ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు

Related News

Select the Topic
Scroll to Top