ఈతరం భారతం హైదరాబాద్: ఆగస్ట్ 31 సోమవారం
________________________________________
చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం మరో 15 రోజులపాటు పొడిగించింది. వాస్తవానికి నేటితో పెన్షన్ల దరఖాస్తు గడువు ముగియాల్సింది.అయితే,సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.ఆదివారం వరకు మొత్తం 4.34 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకోగా..ఇందులో అత్యధికంగా 2.64 లక్షల మంది వితంతువులు దరఖాస్తులు ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తంగా 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.















