ఈతరం భారతం హైదరాబాద్, మే 15:
‘లోక కవి’ డాక్టర్ అందెశ్రీని స్మరిస్తూ 67 మంది కవులు రాసిన కవితా సంకలనం ‘జనగీతిక ను తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి శుక్రవారం రవీంద్ర భారతి లోని తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందెశ్రీని సంస్మరిస్తూ కవులు అక్షరాంజలి సమర్పించడం ద్వారా ఆయన కృషిని కవితాత్మకంగా వివరించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో సాంస్కృతిక సారథి ఏవో డాక్టర్ పి విజయ్ కుమార్, ‘జన గీతిక’ సంకలనం సంపాదకులు డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ తొలి ప్రతి స్వీకర్త ప్రముఖ కవి రేడియం, సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ , సీనీ దర్శకులు నామాల రవీంద్ర సూరి, ప్రముఖ గాయకులు దేవత సుధాకర్, కవి, రచయిత మిద్దె సురేష్ తదితరులు పాల్గొన్నారు.














