EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

హైదరాబాద్ మార్చ్ 20 ఈతరం భారతం:

జనగణన లో బీసీ కులగనన చేపట్టాలనీ, తెలంగాణ రాష్ట్రంలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్ తో మార్చ్ (ఈనెల) 23న బీసీల ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మహదర్నా చేపట్ట నున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.శుక్రవారం కాచిగూడలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అద్యక్షతన 20 బిసి సంఘాలు,30 బిసి కుల సంఘాల అతి ముఖ్యమైన సమావేశం జరిగింది,ఈ సందర్భంగా బిసిల చలో ఢిల్లీ మహాదర్నా కార్యక్రమం సంభందించిన వాల్ పోస్టర్స్ ను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి మీడియాతో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగనను చేపట్టాలని బీసీలు ఉద్యమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఏప్రిల్ 30,2025న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో జాతీ జన గణనలో సమగ్ర కులగన చేపడతామని ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు అలాగే బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టంనీ కేంద్ర ప్రభుత్వానికి పంపించి సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇంతవరకు బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదించలేదన్నారు. ఇంటింటి లెక్కింపులో బీసీ కుటుంబాల లెక్కింపు, బీసీ రిజర్వేషన్ల పెంపు పై జరుగుతున్న ఈ భారీ మహధర్నాకు ఆఖిలపక్ష పార్టీల నేతలు అహ్హనించామ న్నరు, ఈ దర్నా కు దేశంలోని 29 రాష్ట్రాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని కుందారం గణేష్ చారి పిలుపు ఇచ్చారు.ఈ సమావేశం లోగుజ్జ క్ల్రిష్ణ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ సంఘానీ మల్లేశ్వర్, బిసి డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్, సంచార జాతుల సంఘం అధ్యక్షులు కాటేపల్లి వీరస్వామి, నందగోపాల్, , శివమ్మ, గూడూరు భాస్కర్ మేరు, వాణీ, వేణు తదితరులు పాల్గోన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top