ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 8 :ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రచయితలు, కవులు అందరూ ఎక్స్ రే అవార్డు అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు. ప్రతిభకు పట్టం కడుతూ సాహితీ విలువలకి పెద్ద పీట వేస్తూ కవులకి పట్టాభిషేకం చేస్తున్నఎక్స్రే అవార్డు2024 సంవత్సరంకుగాను10 ఉత్తమ కవితలు తెలంగాణ ఆంధ్ర నుండి వివిధ జిల్లాల కవులు ఎంపిక కావడం జరిగిందని అలాగే పూర్వపువరంగల్) ప్రస్తుతం మానుకోటకు చెందిన అక్షరం ప్రభాకర్ కి 44వ జాతీయస్థాయి ఎక్సరే అవార్డు రావడం జరిగిందని శ్రీ కొల్లూరు గారు తెలియజేశారు
ఈ సందర్భంగా అక్షరం ప్రభాకర్ గారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఇచ్చే ఏ సాహితీ పురస్కారము నకు తీసిపోని అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఎక్సరే అవార్డు అనిఈ సంవత్సరం 44వ ఎక్సరే జాతీయ అవార్డు నాకు రావడం ఎంతో ఆనందంగా గర్వకారణంగా ఉందని తెలియజేశారు.మహాకవి దాశరధి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో నాకు అవార్డు రావడం, నాకే కాదుదాశరధి అభిమానులందరికీ ఒక పండుగ అని చెప్పవచ్చు అన్నారు, సందర్భంగా ఆ మహాకవికి ఈ అవార్డు అంకితం అని తెలియజేశారు.జాతీయస్థాయిలో ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని అక్షరం ప్రభాకర్ శ్రేయోభిలాషులు సాహితి గురువులు స్నేహితులుహర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేశారు.ఈ అవార్డు ఫలితాలను ప్రకటించిన న్యాయ నిర్ణీత శ్రీ సర్వజిత్తు గారికి, ఎక్సరే సాహితీ పత్రిక ప్రధాన సంపాదకులు, మరియు ఎక్సరే సాహితి సంస్థ అధ్యక్షులు, కళాపోషకులు మానవతావాది శ్రీ కొల్లూరు గారికి,వారి కార్యవర్గ సభ్యులకు, నా కవిత “కన్నీటి రణం” 44వ జాతీయస్థాయి ప్రధమ బహుమతికి ఎంపికైందని తెలియజేసినఎక్సరే కార్యనిర్వాహకులు ఆ సంస్థ ఉపాధ్యక్షులు, రవికిరణ్ గారికి, నాతో పాటు ఉత్తమ కవిత అవార్డులు తీసుకోబోతున్న పదిమంది కవులకు నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అక్షరం ప్రభాకర్ తెలిపారు.ఈ సందర్భంగా అక్షరం ప్రభాకర్ కి శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు సాహితీ పెద్దలుగురువులు , గౌరవ ఉపాధ్యాయులు, ఉన్నారు, వారిలో డాక్టర్ చిరునగరి శ్రీనివాస్ విశ్వవిద్యాలయ ఆచార్యులుమాట్లాడుతూ పేదింటి బిడ్డకు ఇంత పెద్ద పురస్కారం రావడం మా అందరికీ గర్వకారణం అని తెలియజేశారు మా నాన్నకు అత్యంత ప్రియమైన శిష్యుడు అక్షరం ప్రభాకర్ అని కొనియాడారు, ఈ సందర్భంగా యువ కవి విశ్వ కలం నాగెల్లి సురేష్. తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.















