EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని గృహ నిర్బంధంలో పెట్టడం ఫ్యాసిజమే..     బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్

హైదరాబాద్ ఆగష్టు 12 (ఈతరం భారతం);గత బీఆర్ఎస్ పరిపాలనలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడైనా ఉద్యమం జరిగితే, ఆ ఉద్యమంతో అనుసంధానమైన జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని గృహ నిర్బంధంలో పెట్టడం ఫ్యాసిజమేనని భారతీయ జనతా పార్టీ కఠినంగా ఖండిస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ పేర్కొన్నారు.మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వివిధ రకాల కార్యక్రమాలు తలపెట్టడం సహజం. ప్రజలు ఇక్కట్లపై, ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించడం నాయకుల బాధ్యత.అయితే ఇక్కడ అర్థంపర్థం లేకుండా, ఆలోచన లేకుండా పోలీసులు మితిమీరి అధికార దుర్వినియోగానికి పాల్పడటం దుర్మార్గ వైఖరి అని విమర్శించారు.. ఇదే పరిస్థితి బీఆర్ఎస్ పాలనలోనూ జరిగింది, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగుతోంది.గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కాలం నుంచి ఇప్పటివరకూ, ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు నాయకుల అడుగులకు మడుగులొత్తడం, నాయకుల సూచనలతో అనేక తప్పిదాలు చేయడం, అందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగడం, కుంభకోణాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. అందులో భాగంగానే వివిధ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితి భారతదేశంలో, ప్రత్యేకించి మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోంది.ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, కానీ ప్రభుత్వ వ్యవస్థ నిలకడగా ఉండాలి. అయితే, ఇలాంటి వైనం కారణంగా ఉన్నతాధికారుల అవినీతి వల్ల వివిధ కేసుల్లో విచారణలు జరుగుతున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో, రాజకీయ పార్టీ అధ్యక్షులను అరెస్ట్ చేయడం తీవ్రమైన సమస్య గా ఆయన అభివర్ణించారు.. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విధానాలు, పద్ధతులు మార్చుకోవాలి. తప్పిదాలకు పాల్పడటం వల్లే విచారణలు ఎదుర్కోవాల్సి వస్తున్నది.ఇందిరా గాంధీ కాలం నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ తన పాలనను ప్రజాస్వామ్యానికి మేలు చేశామని, ప్రజాస్వామ్యం వెల్లివిరిసిందని వాదిస్తూనే ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే, ఇటీవలి కాలంలో అనేక రాష్ట్రాల్లో వరుస ఓటములను తట్టుకోలేక, జీర్ణించుకోలేక… కాంగ్రెస్ నాయకత్వంపైనే ప్రశ్నలు, అసమర్థత, అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌పై దాడులు చేయడం, అభాండాలు మోపడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. రాజనారాయణ చేతిలో ఇందిరా గాంధీ ఘోర ఓటమి తర్వాత, ఆ ఓటమిని తట్టుకోలేక ఎమర్జెన్సీ విధించిన చరిత్ర మనకు తెలిసిందే. ఇందిరాగాంధీ అడుగుజాడల్లోనే రాహుల్ గాంధీ కూడా ఇలాంటి మార్గంలో నడుస్తున్నారు.వరుస ఓటములను, పరాభావాలను తట్టుకోలేని కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల కమిషన్ పై దాడులు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యం మీద వారికి నమ్మకం లేదు, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థలపై కూడా వారికి గౌరవం అంతకంటే లేదు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే ఓటు చోరీ గురించి మాట్లాడుతోంది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న ఖజానా చోరీపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ ప్రతి ఎన్నికకు ముందే జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హత పొందుతారు. ఈ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు, బ్లాక్, మండల్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో సమన్వయంతో సమావేశాలు నిర్వహించి, అభ్యంతరాలు, సూచనలు సేకరించి, సలహాలు పాటిస్తూ, చివరగా ఫైనల్ డ్రాఫ్ట్ రూపొందిస్తారు.ఇలాంటి సాంప్రదాయ ప్రక్రియను మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ నాయకత్వం, అవగాహన లోపించిన నేతృత్వం, ఓడిపోతామని ముందే తెలిసిన అధినాయకత్వం కారణాలు వెతుకుతూ దుష్ప్రచారం చేస్తూ బురదచల్లడం కోసం ‘ఓటు చోరీ’ పేరుతో మాట్లాడే విషయాన్ని దేశమంతా అర్థం చేసుకున్నారన్నారు.. బిహార్ లో మరోసారి ఓటమి పాలవడం ఖాయమని తెలిసీ.. ఇండీ కూటమికి ఇక భవిష్యత్తు లేదని తెలుసుకుని ఓటుచోరీ గురించి డ్రామా చేస్తున్నారు.ఈ డ్రామాలో భాగంగా ఇక్కడి ముఖ్యమంత్రి కూడా ‘ఓటు చోరీ గురించి మాట్లాడతాం, ప్రజల్లోకి వెళ్తాం’ అంటూ మాట్లాడున్నారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఖజానా చోరీ, కుంభకోణాలు రోజురోజుకూ బయటపడుతున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఖజానా చోరీ అంశంపై దృష్టి పెట్టాలి.ఈవీఎంలు, బ్యాలెట్ పేపర్లపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు, కుట్రలు, కపట నాటకాలకు పేరుపొందిన పార్టీ.రాష్ట్రంలో స్వయంగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని.. అది నెరవేర్చాలని మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, అనేక పథకాల పేరిట మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చాక వంచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను జాప్యం చేయడం, కాలాపన చేయడం జరుగుతోంది. మరి వీటిగురించి ఎందుకు మాట్లాడటం లేదు?కాంగ్రెస్ అధిష్టానం హామీలపై మాత్రమే మాటలకే పరిమితమై, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందన్నారు.

Related News

Select the Topic
Scroll to Top