ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 11: శుక్రవారం
_________________________________________
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శిగా అల్లం యాదయ్య నియమితులయ్యారు ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ భవన్ లో నియామక పత్రాన్ని అందజేశారు అల్లం యాదయ్య ప్రస్తుతం ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శిగా,ఓబీసీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతు ఉద్యోగుల సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అల్లం యాదయ్య చేస్తున్న పోరాటాలను గుర్తించిన ఆర్ కృష్ణయ్య అతన్ని బీసీ సంక్షేమ సంఘం ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లం యాదయ్య మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యోగుల సమస్యలపై వాటి పరిష్కారానికి పోరాటం చేస్తా నన్నారు. తనపై గల నమ్మకంతో తనకు ఈ పదవినిచ్చిన ఆర్ కృష్ణయ్యకు అల్లం యాదయ్య కృతజ్ఞతలు తెలిపారు















