ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 3
ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ ఉచితాల ప్రస్తావన లేకుండా ఆడంబరాలకు పోకుండా అభివృద్ధి పథం వైపు దృష్టి సారించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన 2026-27వార్షిక జాతీయ బడ్జెట్ ప్రశంస నీయంగా ఉందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా ఆర్ధిక విధానాలతో కూదేలవు తున్న దేశాలు ఒకవైపు రష్యా – ఉక్రెయిన్ ఇతర యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కూడా దేశం 7% వృద్ధిని నమోదు చేయడం, జాతీయ స్థాయిలో వస్తోన్న ఆదాయంలో రాష్ట్రాలకు గతం 41% నుండి 54% పెంచడం, స్థానిక ప్రభుత్వాలకు గతం కంటే 20% నిధులు అదనంగా పెంచడం, జాతీయ ఆదాయంలో అప్పుల శాతం 5% వరకు తగ్గించడం, పెట్టుబడుల కింద 12.2 లక్షల కోట్లకు పెంచడం, మౌలిక సదుపాయల కల్పనకు 14లక్షల కోట్లకు పైగా కేటాయించడం, ప్రతీ జిల్లాలో బాలికలకు హాస్టల్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. విద్యా, ఆరోగ్య, ఉపాధి రంగాలకు అదనంగా నిధుల కేటాయించక పోవడం బాధగాకరంగా ఉందని ఆయన అన్నారు.















