హైదరాబాద్ మార్చ్ 24ఈతరం భారతం
తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO) హైదరాబాద్ నగరమంతటా విస్తృత స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో మెట్రో పిల్లర్లు మరియు హోర్డింగ్స్‌పై ప్రధాన సందేశాలను ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టిని ఆకర్షించేందుకు చర్యలు చేపట్టింది.ఈ ప్రదర్శనల ద్వారా “హోర్డింగ్స్‌ను కాపాడండి” అనే నినాదంతో పాటు జి.ఓ. నం. 84ను పునర్విమర్శించాలని డిమాండ్ చేస్తూ ee నెల 25 న అసెంబ్లీ ముట్టడి కి పిలుపునిచ్చింది .ప్రస్తుత విధానం అవుట్డోర్ ప్రకటన రంగానికి తీవ్ర ముప్పుగా మారుతుందని, ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న దాదాపు లక్షమంది ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.ఇంకా తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తూ, రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమీపంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు TOMO ప్రకటించింది. జి.ఓ. నం. 84ను పూర్తిగా రద్దు చేయాలని లేదా సవరణలు చేయాలని తమ డిమాండ్‌ను మరింత బలంగా వినిపించనున్నట్లు తెలిపింది
.















