ఈతరం భారతం వార్తాంశం

సుప్రసిద్ధ వ్యవసాయశాస్త్ర ఆచార్యులు ప్రొఫెసర్ కూవాపాడి అనంతసుబ్రమణి బాల సుబ్రమణ్యన్ @ k A subramaniyan ఫిబ్రవరి 12 న 85 సంవత్సరాల వయస్సులో అమెరికా సియాటెల్ లో వారి కూతురు ఇంట చనిపోయారు. ఇప్పటివరకు వ్యవసాయరంగ సమూహాల సామాజిక మాధ్యమాల్లో నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. వారి సేవలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్ధులు,విశ్వ వ్యాప్తంగా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంతగా తన బోధనలతో ప్రభావితం చేసిన ఈ ప్రొఫెసర్ ఎవరు? 1939, మే 5 న ఎక్కడో కేరళలో ఎర్నాకులం లో పుట్టి ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల, రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల ల్లో పనిచేసి కేవలం తన వ్యక్తిత్వం, బోధన, నిరాడంబరత, క్రమశిక్షణ, నిజాయితీ, నిరంతర అధ్యయనం తో విద్యార్ధుల మీద చెరగని ముద్ర వేశారు.
సివిల్స్ వద్దు, వ్యవసాయ పరిశోధన లే ముద్దుంటూ తన శిష్యులు కు నూరిపోశారు. పాథాలజీ విభాగం ప్రొఫెసర్ అయినా, వాటి అంశాలు తరగతి గదుల్లో బోధించిన తీరు అసాధారణము. ఆ ప్రతిభ పాటవాలు వారికే సొంతం. అందరూ భయపడే ఫిజిక్స్, మాథెమాటిక్స్, బయో కెమిస్ట్రీ శాస్త్ర అంశాలను కూడా సమ్మిళితం చేస్తూ తన విషయానికి సమన్వయం చేస్తూ, సులువుగా చెప్పటంలో దిట్ట. చెప్పే అంశాన్ని లోతుగా విశ్లేషించి పిల్లలకు అర్ధమయ్యేలా ఆలోచనాత్మకంగా బోధించటం వారి శైలి. అదే వారి ప్రత్యేకత. ఒక శాస్త్రీయ అవగాహన , దృష్టి పిల్లలకు అలవాటు చెయ్యాలనే తపనే వారి లక్ష్యం. దీనితో వారి పాఠం అంటే విద్యార్ధులు చెవి కోసుకుంటారు. ఒక అరుదైన ఉపాధ్యులు. బాపట్ల వ్యవసాయ కళాశాల అయినా, రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల అయినా విద్యార్ధులు కంటే ఎక్కువగా లైబ్రరీ నీ సద్వినియోగం చేసుకున్న తీరు అమోఘం. అది విద్యార్ధులమీద చూపిన ప్రభావం కూడా అంచనా వేయలేనిది. మరో వైపు వీరు తన విషయాన్ని ఎంత ప్రావీణ్యం తో ఆసక్తిగా వివరిస్తారో, అదే రీతిలో అనర్గళం గా మూడు గంటలపాటు సైన్స్ అండ్ spirituality మీద సాధికారం గా మాట్లాడగలరు. విన్న వారు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. ఉపనిషత్తులు ఔపోసన పట్టారు. భగవద్గీత శ్లోకాలు నిరాఘాటంగా, అలవోకగా , రాగ యుక్తంగా చెప్పగలరు. రామకృష్ణమఠం లో వీరు చేసే ఉపన్యాసాలు సైతం అందరిని ఆకట్టుకునేవి. ఒక వ్యక్తికి ఇన్ని అంశాల్లో సాధికారిక ఙ్ఞానం ఉండటం అసాధారణం అని పిస్తుంది.
వారి ఆహార్యం కూడా చాలా చాలా నిరాడంబరంగా ఉంటుంది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ లేదా CSIR పూల్ officer గా పనిచేస్తూ UAS , dharwad లో చేరి, 1977 లో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా చేరారు. మొదట రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల లో పనిచేసి ఆ తర్వాత బాపట్ల వ్యవసాయ కళాశాల కు బదిలీ అయ్యారు. తరువాత బాపట్ల ప్రిన్సిపల్ గా, పాథాలజీ విభాగం యూనివర్సిటీ హెడ్ గా పనిచేసి 1999 లో పదవి విరమణ చేశారు.
మధ్య ప్రదేశ్ లో 1946 లో ఏర్పడి, మొదటి విశ్వ విద్యాలయం గా పేరొంది, అత్యంత పురాతన కేంద్ర విశ్వ విద్యాలయం గా చరిత్ర లో స్థానం సంపాదించిన Dr. Hari Singh Gour Vishwavidyalaya (DHSGSU).Sagar, Madhya Pradesh నుంచి MSC బోటనీ లో విశ్వ విద్యాలయం మొదటి ర్యాంక్ పొందారు. 1963 లో ప్రతిస్థాత్మక భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నుంచి phd పట్టా పొందారు. ప్రపంచలోనే రెండో ర్యాంక్ లో ఉన్న ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ మెడిసిన్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి 1969 లో మరో డాక్టరేట్ పట్టా పొందిన మేధావి.
ప్రొఫెసర్ మంచి సంగీత విద్వాంసులు. గాత్రం కమనీయంగా ఉంటుంది. పదవి విరమణ తరువాత విశాఖ లో స్థిర పడ్డారు. తరువాత అమెరికా వెళ్ళి అక్కడ తబల, మృదంగం లో పిల్లలకు శిక్షణ ఇవ్వడం చేశారు. నిరంతరం వారి శిష్యుల తో అనుబంధం కొన సాగిస్తూ , వారికి అవసరమైన గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. పైగా వీరు ప్రధాన రచయిత గా, వారి మనుమలు, మనుమ రాళ్ళు సహా రచయితలుగా రాసిన పరిశోధన పత్రాలు అంతర్జాతీయ ము గా పేరొందిన జర్నల్స్ లో ప్రచురితం కావటం కూడా వారి పరిశోధనా దృష్టికి తార్కాణం. ఇది వారు నిరంతర పరిశోధకులు అన్న సత్యాన్ని గుర్తించడం గా భావించ వచ్చు.. వారి మార్గ దర్శనం తో 72 మంది పిజి, 21 మంది పిహెచ్డీ లు పొందారు. వీరి శ్రీమతి 4 సంవత్సరాల క్రితం మరణించారు.వారి బ్లాగు ద్వారా విశ్వానికి సుపరిచితులు. What’s app ద్వారా శిష్య ప్రశిష్యులు తో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి సేవలు ప్రత్యక్షంగా పరోక్షంగా సలహాలు సూచనలు రూపంలో అందుతూనే ఉన్నాయి. వారి శిష్యులు, నాకు electronic మీడియా లో గురువు , 1975 బ్యాచ్ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి, పిజి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల లో పాథాలజీ విభాగం లో DR KA subramaniyan మార్గ దర్శనం లో పీజీ చేసిన బొగ్గవరపు వెంకట్రావ్ గారు వారు పదవి విరమణ చేసే వరకు గుర్తు చేసుకోవటం నాకు తెలుసు. మా గురువుని భాష వల్ల వ్యవసాయ కార్యక్రమం లో పరిచయం చేయలేక పోయాను అని బాధపడుతూ ఉండే వారు. మా 1980 బ్యాచ్ లో బాపట్ల వ్యవసాయ కళాశాల లో పాథాలజీ విభాగం లో పీజీ చేసిన వారందరికీ వారి పాఠాలు వినే అవకాశం దొరికింది. ఇతర విభాగాల్లో పిజి చేసిన నండూరి తదితరులకు వ్యక్తిగత పరిచయం భాగ్యం కలిగింది . 1980 బ్యాచ్ హైమవతి, 1981 బ్యాచ్ బాల త్రిపుర సుందరి, 1982 బ్యాచ్ ,1983 బ్యాచ్ ..ఇలా కొందరి కి వారి పిజి లో గైడ్ గా ఉన్నారు. ఈ బ్యాచ్ లకు పిజి లో బోధించారు.
1977 బ్యాచ్ కి చెందిన కృష్ణ ప్రసాద్ జి నీ కదిలిస్తే సార్ is my ultimate అనే భావన వారిది. రాజేంద్ర నగర్ 1980 బ్యాచ్ R. జగదీశ్వర్ కు వారి డివిజన్ అంటే ప్రాణం. ఆ విభాగం నిరంతరం రైతునేస్తం కావాలనే తాపత్రయం.అందుకేనేమో ఈ సార్ తో 15 రోజుల క్రితం ఒక 20 నిమిషాలు మాట్లాడారు . అలానే ప్రొఫెసర్ TVK సింగ్ గారు వారి కుటుంబం తో టచ్ లోనే ఉన్నారు. 1983 బ్యాచ్ బాపట్ల పూర్వ విద్యార్థి Dr T లక్ష్మీ నరసయ్య ను కదిలిస్తే ..ప్రొఫెసర్ KA subramaniyan గారి teaching గురించి, IARI లో వారు phd సమయం లో ప్రొఫెసర్ Delhi వచ్చిన సమయం లో స్కూటర్ మీద తిప్పిన రోజులు అన్ని ఏకరువు పెట్టారు. వారితో పని చేసిన సహచరులు అంతా వారి వ్యక్తిత్వం గురించి సామాజిక మాధ్యమాల్లో విశ్లేషిస్తూ నివాళి అర్పిస్తూ ఉన్నారు.
ఇటీవల డల్లాస్ లో జరిగిన ఆరంగేట్రం, prof KA subramaniyan గారు అనర్గళంగా మాట్లాడిన వీడియో, what’s app లో వారితో జరిపిన సంభాషణలు పెడుతూ వారి జ్ఞాపకాలను కలబోసుకుంటున్నారు. Prof KA subramaniyan.. పసిఫిక్ తీరం Hawain juicy pine apple తినాలన్న నా చిన్న నాటి చిరకాలపు కోరిక తీరింది అంటూ పోస్ట్ చేసిన ఫోటో ను షేర్ చేస్తూ వారి తో ఉన్న అనుభవాలను, అనుభూతులను పంచుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియ చేస్తూ ఉన్నారు.

ANGRAU comptroller గా పనిచేసిన Prof AS Rao….prof KA subramaniyan గారు 75 సంవత్సరాలు నిండిన తరువాత పెన్షన్ కు జత కావలిసిన commutation జరగ లేదంటూ ఫోన్ చేసిన సందర్భం, ఒక రోజులో సరిచేస్తూ ఇచ్చిన ఆర్డర్ గుర్తు చేసుకుంటూ, ఇటీవల ఏదో సందర్భంగా మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం పూర్వ, ప్రస్తుత బోధన సిబ్బంది, విద్యార్ధిలోకం మొత్తం prof KA subramaniyan సేవలు గుర్తు చేసుకుంటూ సగౌరవంగా నివాళి అర్పిస్తూ ఉంది.
వారి ప్రత్యక్ష, పరోక్ష శిష్యగణం వారి పేరిట ప్రతి సంవత్సరం స్మారక ఉపన్యాసం, పురస్కారం ఏర్పాటు చేయటం ద్వారా వారి స్ఫూర్తిని కొనసాగించటమే వారికిచ్చే నివాళి కాగలదు.
🌹🌹💐💐💐💐🌹
వలేటి గోపీచంద్
ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థి















