EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జీహెచ్ఎంసీ లైసెన్స్‌ కేబుళ్లు తప్ప మరే కేబుళ్లు ఉంచొద్దు..హైకోర్టు ఆదేశం

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 22 :లైసెన్స్ కలిగి ఉన్న కేబుళ్లు తప్ప విద్యుత్ స్తంబాలకు మరే కేబుళ్లు ఉంచవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.జీహెచ్ఎంసీలో కేబుళ్ల తొలగింపుపై ఎయిర్ టెల్ పిటిషన్ పై ఇవాళ జస్టిస్ నగేశ్ భీమపాక మరోసారి విచారణ జరిపిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై న్యాయమూర్తి తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఇటీవల రామంతాపూర్ లో శ్రీకృష్ణామి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్ వైర్ నుంచి విద్యుత్ సరఫరా కావడం వల్ల ఐదుగురు మరణించిన ఘటను ఈ సందర్భంగా జడ్జి ప్రస్తావించారు. బర్త్ డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఘటనపై ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన 9 ఏళ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలిచివేసిందన్నారు. పసి హృదయం పగిలిపోయింది, అందరం బాధ్యులమేనన్నారు. సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. చలనరహిత చట్టాలతో ప్రజల ప్రాణాలను ఎలా కాపాడగలమని ప్రశ్నించారు. రామాంతపూర్ ఘటన నేపథ్యంలో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిచింది. ఈ నిర్ణయంపై ఎయిర్ టెల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిపింది.

కరెన్సీ నోట్లపై గాంధీని బాగానే గుర్తు పడతారు:

విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అనిజస్టిస్ నగేశ్ భీమపాక సూటి ప్రశ్న వేశారు. వైర్ల బరువుతో స్తంబాలు ఒరిగిపోతున్నాయన్న పిటిషనర్ల వాదనపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాముళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్తాంభాలపై అన్ని వైర్లు నల్లగా ఉన్నందునా గుర్తుపట్టలేకపోయామన్న పిటిషనర్ వాదనకు కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగనే గుర్తుపడతారని చురకలు అండించారు. ఒకరినొకరు నిందించుకోకుండా ఇలాంటివి పునరావృతం కానివ్వొద్దని సూచించారు. చట్టాలు కఠినంగా ఉంటే అమలు చేయలేం, సులభంగా ఉంటే ప్రజలు ఆచరించరని వ్యాఖ్యానించారు

Related News

Select the Topic
Scroll to Top