EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కేసీఆర్ నాయకత్వం నిజం చేసింది: పద్మారావు గౌడ్  

సికింద్రాబాద్ ఆగష్టు 15 (ఈ తరం భారతం);79 వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సికింద్రాబాద్ సీతాఫల్ మంది బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం లో స్థానిక శాసన సబ్యులు టి.పద్మారావు గౌడ్ జాతీయ జండాను ఎగుర వేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పోరాటం జరిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అభివృద్ధి, సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయ విస్తరణలో అద్భుత విజయాలను సాధించి.. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కేసీఆర్ నాయకత్వం నిజం చేసింది. ఎక్కడో 14 స్థానంలో ఉన్న తెలంగాణ 10 ఏళ్లలోనే పంజాబ్, హర్యానాను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో అగ్రభాగాన చేరడానికి రైతును రాజునే చేయాలన్న కేసీఆర్ సంకల్పమే కారణం అని పేర్కొన్నారు.ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్రం సిద్ధించి 79 ఏళ్లు అవుతుందని ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పా బీఆర్ఎస్ తరపున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 14 రాష్ట్రాలతో మొదలైన స్వతంత్ర భారతదేశ ప్రయాణం ఇవ్వాళ 28 రాష్ట్రాల వైవిధ్య భారతంగా విలసిల్లుతుందన్నారు..అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో మొత్తం భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.ee కార్యక్రమం లో రామేశ్వర్ గౌడ్,సామల హేమ ,నిర్మల ముదిరాజ్, శోభ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top