EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 30

మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు ప్రధానం చేయబోతున్న శ్రమశక్తి అవార్డులలోసౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కోపరేటివ్ సోసైటీ అధ్యక్షునిగా సేవలు అందజేస్తున్న చిలుకు స్వామి ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

రేపు రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈ అవార్డును ప్రధానము చేయనున్నారు

ఆలేరు మండలం షారాజిపేట గ్రామ నివాసి అయిన స్వామి ఒకవైపు రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే గ్రామంలో ఎయిడ్స్ పట్ల అవగాహన రక్తదానము శ్రమదానము శిబిరాలు నిర్వహిస్తూ గ్రామ యువకులను చైతన్య పరుస్తున్నారు. వీరిసేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ మేడే సందర్భంగా శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది.

చిలుక స్వామికి ఈ గౌరవము లభించడం పట్ల పలువురు రైల్వే ఉద్యోగులు, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు

Related News

Select the Topic
Scroll to Top