ఈతరం భారతం హైదరాబాద్ జులై 31:
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి బిఎ, బికాం, బిఎస్సీ, మరియు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సుల అడ్మిషన్ల చివరి గడువు ఆగస్ట్ 7 వ తేదీ వరకుఉన్నదని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కళాశాల ప్యారడైజ్ , సికింద్రాబాద్ లో గల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కవితాదేవి, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్ రవి శుక్రవారం తెలిపారు. BA, B.Com, Bsc, MA,M.Com, Msc కోర్సులలో చేరే విద్యార్థులందరూ www.braouonline.in లేదా www.braou.ac.in రిజిస్ట్రేషన్ చేసిన తరువాత ప్రింట్ తీసుకొని ఆ కాపీకీ, సర్టిఫికెట్స్ ని జతచేసి స్టడీ సెంటర్ లో సమర్పించాలని సూచించారు.M.B.A జనరల్ కోర్సులలో చేరే విద్యార్థులు Telangana state Govt నిర్వహించిన ఐసెట్ లో గాని BRAOU (MBA CET) లో గాని ఉత్తీర్ణులై డిగ్రీలొ 50 శాతం మార్కులు తప్పనిరిగా ఉండాలన్నారు. డిగ్రీలో అడ్మిషన్ పొందడానికి ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కోర్సు, రెండు సంవత్సరా ఐటిఐ కోర్సు ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు www.braou.ac.in లో కాని,సికింద్రాబాద్ స్టడీ సెంటర్‌లో లేదా 7382929623 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.















