EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ విద్యార్థులకు ఉపాధి కల్పించే దిశగా కృషి

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 5 :డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులకు తక్కువ ఫీజుకే నాణ్యమైన విద్యను అందిస్తూ ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తుందని విద్యార్థి సేవా విభాగం (LSSB) డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల గడువు అక్టోబర్ 10 వరకు ఉందన్నారు. బిఏ, బికాం, బిఎస్సీలో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటిఐ 10+2 ఉత్తీర్ణులు కావాలన్నారు. విద్యార్థులు దరఖాస్తుల కోసం www.braouonline.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు. ఓపెన్ యూనివర్సిటీలో చేరే విద్యార్థులకు రిటైల్ రంగంలో ఉపాధి కల్పించడానికి (RASCI) సంస్థతో యూనివర్సిటీ ఒప్పందం చేసుకుందన్నారు. విద్యార్థులు ఒకేషనల్ ట్రైనింగ్ లో ఆసక్తి ఉంటే రామనందతీర్థ Rural Institute లో శిక్షణ కల్పిస్తమన్నారు. సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు పీజీలో సామాజిక శాస్త్రాలు చదువుకునే అశకాశం ఉందన్నారు. డిగ్రీ ఉత్తర్ణులైనవారు Bsc, B.Tech, BBA విద్యార్థులు పీజీ కోర్సలైన ఎంఏ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, చరిత్ర, ఎకనమిక్స్, సోషియాలజీ, ఎంఏ జర్నలిజం కోర్సులను చదువుకునే అవకాశం ఉందన్నారు. బిఎస్సీ సైన్స్ విద్యార్థులు ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్వీరాన్ మెంట్ సైన్స్ చదువుకోవచ్చన్నారు.

Related News

Select the Topic
Scroll to Top