EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత నీరు మరియు మజ్జిగ పంపిణీ

ఈతరం భారతం హైదరాబాద్ మే 18 :

డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా తాగునీరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి తాగునీరు మరియు 2500 మందికి మజ్జిగ అందజేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సమాజ సేవలో భాగంగా ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు మరియు విద్యా కార్యక్రమాలు డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ నిరంతరం నిర్వహిస్తుందని సొసైటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ మాధవి పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top