ఈ తరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 6 :తెలంగాణలో జూబ్లీహాల్స్ ఉపఎన్నికలకు నోటీఫికేషన్ విడుదలైన విషయం తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ సీపీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, జిల్లాల్లో లైసెన్సు తుపాకులు పొందిన నేతలు, వ్యాపారులు వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే ప్రజలు డయల్ 100 లేదా 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.















