EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణలో చుక్కలు చూపిస్తున్న బియ్యం ధరలు: కిలో రూ.100కు చేరిక

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 16:

రాష్ట్రంలో బియ్యం ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్ నినో ప్రభావంతో దిగుబడి తగ్గిందనే సాకుతో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు చేపట్టింది.కిలో సన్నబియ్యం ధర మార్కెట్‌లో ప్రస్తుతం రూ.85 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం సన్నబియ్యం రకాన్ని బట్టి కిలోకు రూ.66 నుంచి రూ.79 వరకు ఎంఆర్‌పీ నిర్ణయించింది. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లు, వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top