ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 22
తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌పై కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి.రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇకపై ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత కావలసి ఉంటుంది. ఈ విధానం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందని రవాణా శాఖ ప్రకటించింది LLR కు దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు ఆన్లైన్లో రోడ్డు భద్రత కు సంబంధించిన పాఠాలు విని పరీక్ష రాయాలి. ఇందులో ఉత్తీర్ణులై, సర్టిఫికెట్ నెంబర్ పొందిన తరువాతనే LLR స్లాట్ బుక్ చేసుకోవాలి















