Aug 09, 2025, ఈతరం భారతం హైదరాబాద్ :
గత వారం రోజులుగా తెలంగాణలో కుంభవృష్టి వర్షం కురుస్తుండగా, హైదరాబాద్లో ఉదయం ఉక్కపోత, సాయంత్రం కుండపోతగా వాన పడుతోంది. శనివారం నుంచి 15వ తేదీ వరకు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 10, 11న మంచిర్యాల, ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి, నాగర్కర్నూల్ జిల్లాల్లో, 12, 13, 14, 15న ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.















