ఈతరం భారతం ఫిబ్రవరి హైదరాబాద్ 16
రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఈ మేరకు డీపీఆర్ కూడా సిద్దమవ్వగా.. ఇది రైల్వేబోర్డ్‌కు కూడా అందింది. వికారాబాద్-కృష్ణా మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. 130 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ చేపట్టనుండగా.. ఇందుకు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. రైల్వే బోర్డు నుంచి డీపీఆర్‌కు అనుమతి లభించాక ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పుడు ఎలైన్‌మెంట్‌లో పలు మార్పులు చేశారు. గతంలో 120 కిలోమీటర్లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఎలైన్‌మెంట్ మార్చడంతో 130.28 కిలోమీటర్లకు చేరుకుంది. ఇది పూర్తయితే దక్షిణ తెలంగాణకు వరంగా మారనుంది.















