EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను అమలుకు K K కమిటీ ఏర్పాటు పట్ల హర్షం

ఈతరం భారతం హైద్రాబాద్ మే 21:

తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ ఆధ్వర్యం లో తెలంగాణ ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీల అమలు కోసం K K కమిటీ ను ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి , పొన్నం ప్రభాకర్,TPCC అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ లకు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ ధన్య వాదాలు తెలిపింది. ఈమేరకు ముఖ్య అతిధి గా k k కమిటీ సభ్యులు శ్మోతె శోభన్ రెడ్డి హాజరై ప్రతి ఉద్యమ కారునికి న్యాయం జరిగే విధంగా బాధ్యత తీసుకుంటాను అని తెలియ చేశారు.కాలయాపన చేయకుండా త్వరగా రిపోర్ట్ ఇచ్చి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తే 2029 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ కారులు రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్య మంత్రి గా గెలిపించుకుంటారు.కమిటి ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ కారుల బంధువు గా మారారని తెలియ చేశారు. ఆనాడు పార్ల మెంట్ లో పెప్పర్ స్ప్రే ను ఎదుర్కొని తెలంగాణ బిల్లు పాస్ కావటం లో ముఖ్య భూమిక ను పోషించిన పొన్నం ప్రభాకర్ గారు నేడు K K కమిటీ ఏర్పాటు లో కూడా ముఖ్య భూమికను పోషించి ఉద్యమ కారుల కి అండగా ఉన్నారని తెలియ చేశారు.TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శాసన మండలి లో ఉద్యమ కారుల అంశాన్ని ప్రస్తావించి కమిటీ ఏర్పాటులో ముఖ్య భూమికను పోషించారు.అసెంబ్లీ లో ఉద్యమ కారుల అంశాన్ని ప్రస్తావించిన బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారికి Mlc Brs నాయకులు L రమణ గారికి MLA కూనంనేనీ సాంబశివరావు cpi గారికి MLC విజయ శాంతి గారికి MLC కోదండరాం లకు

ధన్యవాదములు.గత 9 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ ఉద్యమ కారుల ఆత్మ గౌరవం సంక్షేమం కోసం పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుల అంశాన్ని అజెండా గా మార్చినము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టించటం లో ముఖ్య భూమిక ను పోషించినాము నేడు కమిటీ ఏర్పాటు లో కూడా ముఖ్య భూమికను పోషించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ గత 9 సంవత్సరాల పోరాట ఫలితమే నేడు కేకే కమిటీ ఏర్పాటు. ప్రతి నిజమైన తెలంగాణ ఉద్యమ కారుల ను గుర్తించి హామీల ఫలాలు అందించాలని కోరుతున్నాం అని చెప్పారు.

ఈ కార్య క్రమంలో దయానంద్. జగన్ యాదవ్.R k భూపాల్. యాలాల మహేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి. నాగ జ్యోతి. మంజూష .భానుప్రకాష్ రెడ్డి. సురేందర్ రెడ్డి. శోభక్క.శ్యామల.రాజేందర్. నరసింహ చారి.భాస్కర్.తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top