EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలతో కల్వకుంట్ల కవిత వరుస సమావేశాలు

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 4

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ సమగ్రాభివృద్ధి – సబ్బండ వర్గాల వికాసం – సామాజిక తెలంగాణ సాధన కోసం 50 అధ్యయన కమిటీలను ఏర్పాటు చేసారు.తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా బ్లూ ప్రింట్ రూపొందిస్తున్న అధ్యయన కమిటీలు ఇప్పటికే నివేదిక సమర్పించాయి. పలు కమిటీలు.. మిగతా కమిటీలు.. త్వరలోనే నివేదికలు ఇవ్వనున్నాయి. ఒక్కో కమిటీలో జాగృతి అధ్యక్షురాలు ముగ్గురు నుంచి నలుగురు సభ్యులను నియమించేరు.ఆయా రంగాల నిపుణులు, ప్రముఖులు, క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా నివేదికల రూపకల్పన జరుగుతుంది.ఆయా కమిటీల నివేదికల ఆధారంగా రాష్ట్ర అభివృద్ధితో పాటు వివిధ వర్గాల ప్రజల సాధికారత కోసం రూట్ మ్యాప్ రూపొంచే ప్రయత్నాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిమగ్నమైనారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top