ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 22
అన్ని ప్రభుత్వ సంస్థలకు అవసరమైన దుస్తులను టెస్కో ద్వారానే సేకరించాలని హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.గురుకుల పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన దుస్తులు, బెడ్ షీట్లను ప్రైవేట్ సంస్థల ద్వారా సరఫరా చేసేందుకు, ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్(పీఎంయూ) .ఈ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన వీరాంజనేయ హ్యాండ్లూమ్ వీవర్స్, మ్యూచుపల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ సొసైటీ లిమిటెడ్.పిటిషన్ విచారిస్తూ చేనేత పరిశ్రమపై దాదాపు 40వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, చేనేత పరిశ్రమను నిలబెట్టేందుకే గతంలో ప్రభుత్వం అన్ని కాంట్రాక్టులు వారికే చెందేలా జీవో తెచ్చిందని గుర్తుచేసిన న్యాయమూర్తి.
అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులు.. వాళ్ల చేనేత అవసరాలను టెస్కో నుండే సేకరించాలని హైకోర్టు ఆదేశాలు.తాము సరఫరా చేయలేమని టెస్కో ధృవీకరణ పత్రం జారీ చేస్తేనే ఇతర ఏజెన్సీల ద్వారా దుస్తులు సేకరించాలని, పీఎంయూ విడుదల చేసిన నోటిఫికేషన్ చెల్లదని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు.















