ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 1;
బీసీ సంక్షేమ సంఘం ఓబీసీ మహిళా అధ్యక్షురాలు వాణి రెడ్డి నేడు తెలంగాణ రక్షన సేన (టిఆర్ఎస్) పార్టీలో చేరారు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వాణి రెడ్డికి పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాణిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాలకు సమన్యాయం జరగడం జరగాలంటే అది కల్వకుంట్ల కవితతోనే సాధ్యమవుతుందన్నారు .టిఆర్ఎస్ పార్టీ పెట్టి పెట్టిన అణతి కాలంలోనే ప్రజాదరణ పొందిన కల్వకుంట్ల కవిత పార్టీ నేడు ప్రజల్లోకి దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఆమెపై రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆరాభిమానాలను తాను ముగ్ధరాల్ని ఆయి పార్టీలో చేరినట్లు వాణిరెడ్డి తెలిపారు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ధీమాను వాణిరెడ్డి వ్యక్తం చేశారు.














