EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్  తీర్మానం చేసిన బీసీ కుల సంఘాలు నాయకులు

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 21

తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీసీ కుల సంఘాలు నాయకులసమావేశం తీర్మానంచేసింది.మంగళవారం అంబర్ పేట్ బీసీ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశం బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి మాట్లాడుతూ అడుగడుగునా కార్మికులకు అన్యాయం జరుగుతున్నది. తెలంగాణ తెచ్చినది ప్రజల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు, సక్రమంగా జరగాలని గౌరవ పెద్దలు కీర్తిశేషులు ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ గారు ముందే చెప్పారు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహానీయుడు అని కుందారం గణేష్ చారి కొనియాడారు. 1957 ముల్కి ఇడ్లీ,సాంబార్ ఉద్యమం మొదలుకొని 1968 తొలిదశ, మళిదశ ఉద్యమం 2000 నుండి తన ప్రాణం లో ఊపిరి ఉన్నంతకాలం తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అతనిని అధికారికంగా ప్రభుత్వము తెలంగాణ జాతిపిత అని డిక్లేర్ చేయాలి అని కుందారం అనే చారి కోరారు. తెలంగాణ లో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం పక్కన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కుందారం గణేష్ ఆచారి కోరారు. జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 79 సంవత్సరాల నుండి పాలకులు అన్ని విధాల తెలంగాణకు అన్యాయం చేశారు. దీన్ని ఎదిరించి తెలంగాణ సాధించడానికి ముందున్న మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆయన జయంతిని, వర్ధంతిని అధికారిక నిర్వహించాలని కోరారు ఆయనను తెలంగాణ.జాతిపితగా ప్రభుత్వం *GO* తీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జిల్లా, మండలాల నుండి వచ్చిన నాయకులు మంచిర్యాల బ్రహ్మం కరీంనగర్, అశోక్ చారి సంగారెడ్డి, కమ్మరి మహేష్, శ్రీపాద నరేష్, అక్కెనపల్లి శ్రీనివాస్ చారి, చేపూరి లక్ష్మణాచారి, మూడు చింతలపల్లి బాలకృష్ణ రాచపల్లి శ్రీధర్, మునిగంటి బ్రహ్మచారి, తాటికొండ శ్రీనివాస్, యాదాద్రి కృపాచారి, మెదక్ బిక్షపతి, కృపాకర్ చారి, పాలమాకుల అశోక్ చారి, సాంబచారి, శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top