EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్

ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 28

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ అయ్యారు. హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు విడతల్లో సేవలు అందించారు.

ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్‌ల జాబితాను తెలంగాణ ప్రభుత్వానికి పంపించిన సంగతి తెలిసిందే. అందులో సీవీ ఆనంద్‌తోపాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, సౌమ్యమిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురిలో అత్యంత సీనియర్‌ అయిన సీవీ ఆనంద్‌ను డీజీపీగా ప్రభుత్వం నియమించింది.

Related News

Select the Topic
Scroll to Top