ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 6 ఆదివారం
_______________________________________
ఢిల్లీలోని 4 అంతస్తుల సత్యనికేతన్ పీజీ భవనం కూలిపోయిన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం, ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో సరైన హాస్టల్ వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు ఇరుకు భవనాలు, నాసిరకం పీజీల్లో ప్రమాదకర పరిస్థితుల మధ్య నివసించాల్సి వస్తోందని ఆయన మండిపడ్డారు.ఈ ఘటన ఎంతో బాధాకరం, ఆందోళనకరం. విద్యార్థుల జీవితాలు ఇప్పటికే ఎన్నో పోరాటాలతో నిండి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన వసతి గృహాలు లేక ఒకే చోట 30-40 మంది విద్యార్థులు అమానవీయ, ప్రమాదకర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోంది. ప్రతి విద్యార్థి ప్రాణం అత్యంత విలువైనది, వారి భద్రతను అన్ని వేళలా పరిరక్షించాలి’ అని X (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.















