ఈ తరం భారతం హైదరాబాద్, జూన్ 27:
తెలంగాణ మద్యం విక్రయాల్లో అత్యధిక – వాటా విస్కీదేనని గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో – పోలిస్తే.. తెలంగాణలో మద్యం ప్రియులు.. విస్కీకే ఎక్కువప్రాధాన్యమిస్తున్నారు. ఇక త్వరలోనే తెలంగాణలో మద్యం ధరలు ” పెంచేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తుండటంతో.. విస్కీ లవర్స్‌కు షాక్ – తప్పదనే వాదనలువినిపిస్తున్నాయి. మద్యం ధరల పెంపు ప్రతిపాదనలతోమందుబాబుల్లో తెలియని ఆందోళన నెలకొంది. తెలంగాణలోని ఏ వైన్స్, ఏ బార్లోకి వెళ్లినా విస్కీ అమ్మకాలే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వేసవి కాలం సందర్భంగా ఎండవేడిమిని తట్టుకునేందుకు మద్యం ప్రియులు.. చల్లని బీర్లు తాగుతున్నా.. విస్కీ అమ్మకాలే అత్యధికంగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ మద్యం మార్కెట్లో విస్కీదే సింహభాగం ఉంటుంది. తక్కువ ధర బ్రాండ్ల మద్యం దగ్గరి నుంచి ఖరీదైన బ్రాండ్ల వరకు మందుబాబులు విస్కీకే ఓటేస్తున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విస్కీ వినియోగం అత్యధికంగా ఉంది. ఇదే సమయంలో.. తొందర్లోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో విస్కీ ప్రియుల జేబుకు చిల్లు తప్పదనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి. 2026లో మద్యం మార్కెట్ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో అమ్ముదు అవుతున్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్లో P 5 – విస్కీవాటా ఏకంగా 84.89 శాతం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో దేశంలోనే – అత్యంత ఎక్కువ విస్కీ విక్రయించే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది. ఇది కర్ణాటకలో 76.50 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 55 శాతం మాత్రమే ఉంది. మరోవైపు.. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ బ్రాండీ వినియోగమే ఎక్కువగా ఉండటం గమనార్హం. 3 హైదరాబాద్ లోని బటీ, సర్వీస్ సెక్టార్ ఉద్యోగుల్లో పెరుగుతున్న డిమాండ్ కారణంగా బ్రీజర్ల వాటా 3.32 శాతంగా నమోదైనట్లు గణాంకాలు 3 పేర్కొంటున్నాయి. తెలంగాణలో విస్కీ అంటే కేవలం మద్యం మాత్రమే కాదని.. సామాజిక జీవనంలో ఒక భాగమైపోయిన అలవాటు గా మరిపోయేందని చెప్పవచ్చు.
మద్యం ధరలు పెరిగితే.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని కుటుంబాలు, రిటైల్ వ్యాపారులు, హాస్పిటాలిటీ రంగంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో మీడియం, ప్రీమియం విస్కీ బ్రాండ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. మొత్తం విస్కీ అమ్మకాల్లో 45.9 శాతం క్వార్టర్ రూ.170 నుంచి రూ.260 మధ్య ధర కలిగిన బాటిళ్లే ఉండటం గమనార్హం. ఇక రూ.110 ధర కలిగిన క్వార్టర్ల వాటా 22.69 .. . 140-160 6 2 21.07 అమ్మకాలు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో రూ.270-రూ.350 ధరల ప్రీమియం విస్కీల వాటా 6.54 శాతం కాగా.. రూ.350 కంటే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం బ్రాండ్ల వాటా 3.8 శాతంగా ఉంది. తెలంగాణలో అమ్ముడయ్యే ప్రతీ 10 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో దాదాపు 9 బాటిళ్లు విస్కీయే కావడం విశేషం. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్లో విస్కీ తర్వాత బ్రాందీ నిలిచింది. బ్రాండీ వాటా కేవలం 9.21 శాతం మాత్రమే ఉంది. ఆ తర్వాత వోడ్కా 1.24 శాతం, వైన్ 0.88 శాతం, రమ్ 0.32 శాతం, జిన్ 0.09 శాతం, లిక్యూర్ 0.04 శాతం, టెకిలా కేవలం 0.01 శాతం మాత్రమే వాటాను కలిగి ఉన్నాయి. ఒకప్పుడు దక్షిణ భారత రాష్ట్రాల్లో బ్రాందీకి భారీగా డిమాండ్ ఉండేది. అయితే తెలంగాణలో ప్రస్తుతం అది భారీగా తగ్గిపోయింది. బ్రాండీ విభాగంలో కూడా రూ.150 నుంచి రూ.200 మధ్య ధరల ఉత్పత్తులే 63.99 శాతం అమ్మకాలను సాధిస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణలో బీర్ అమ్మకాల్లో కూడా కీలక మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు స్ట్రాంగ్ బీర్‌కు ఎక్కువ ఆదరణ ఉండగా.. ప్రస్తుతం లైట్ బీర్ వైపు మందుబాబులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం బీర్ అమ్మకాలలో లైట్ బీర్లు 55.97 శాతం ఉండగా.. 44.03 శాతం స్ట్రాంగ్ బీర్ల వాటా నమోదైంది. మార్కెట్ వర్గాల ప్రకారం.. తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాల వైపు యువత మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.















