EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారతీయ సంస్కృతిలో వీణ వాదనకు విశిష్ట స్థానం

ఈ తరం భారతం హైద్రాబాద్ జూన్ 27 :

శ్రీ మానస ఆర్ట్స్, దివ్య సాయి వీణా అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన అష్టోత్తర శత వైనిక నాద యజ్ఞం” కార్యక్రమం రవీంద్ర భారతీ పథాన వేదికపై జరిగింది.దివ్య సాయి వీణా అకాడమీ అధ్యక్షులు పి వరప్రసాద్ ఆరక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగార ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె.వి.రమణా చారి ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారులను సత్కరించి ప్రసంగించారు. డా॥రమమ మాట్లాడుతూ

భారతీయ సంస్కృతితో వీణకి ఉన్నస్థానం మనోవితమూ, మహోన్నతమైనవనీ అన్నారు. ఈఅపురూప”కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించిన దివ్య సాయి వీణా అకాడమీ అమానస సంస్థలు పాత్ర అభినందనీయమని కొనియాడారు

118 మంది కి పైగా మహిళా కళాకారులతో అపూర్వంగా, ” అష్టోత్తర శత వైనిక నాద యజ్ఞం వీనుల విందుగా కన్నుల పండువగా నిర్వహించిన కళాకారులు ధన్యులు అని తెలంగాణ పూర్వ సలహాదారు డా. కే.వి. రమణా చారి అన్నారు. ఈ కార్యక్రమంలో బింగి నరేందర్ దైవజ్ఞ శర్మ ఝాన్సీరామ్ మీనాక్షి శ్రీనివాస్ గోవింద రాజన్ రామ్ దాస్ తేజావత్ మానస సంస్థ అధ్యక్షులు బండారుపల్లి రామచంద్ర రావు మానస కార్యదర్శి రఘు దివ్య సాయి వీణ అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత శ్రీకాంత్ దివ్య సాయి కృష్ణ శ్రీ కోకా భవాని తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top