ఈతరంభారతం హైదరాబాద్ ఆగస్టు 9: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే రాఖీ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఎంతో ఘనంగా జరిగింది.
అక్క చెల్లెల్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టారు. రాఖీలు కట్టిన ఆడపడుచులకు సోదరులు కానుకలు అందజేశారు. ఆడపడుచుల సందడితో ప్రతి ఇంటా పండుగ వాతావరణం నెలకొంది. రాఖీ సందర్భంగా పలు ప్రధాన ఆలయాలలో ప్రత్యేక పౌర్ణిమ పూజలు జరుగగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.















