హైదరాబాద్ ఆగష్టు 15 (ఈతరంభారతం);79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ స్వాభిమాన పరిషత్ ఆధ్వర్యంలో(మలక్పేట్) సైదాబాద్ లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన వారిని గుర్తుచేస్తూ అలాగే దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారికోసం ఈ రక్తదాన శిబిరాన్ని అంకితం చేస్తున్నట్లు స్వాభిమాన పరిషత్ కన్వీనర్ వినయ్ కిషోర్ యాదవ్ తెలిపారు. స్వాభిమాన పరిషత్ ఆద్వర్యం లో గత 20 సంవత్సరాలుగా పార్టీ లకు అతీతంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నేటికీ స్వాతంత్ర సిద్దించి 79 సంవత్సరాలు కాస్తున్నప్పటికీ దేశంలో యువత ఆశించిన మేరకు ముందుకు వెళ్ళకుండా పెడదారిన పట్టి చెడు మార్గాలలో పయనిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా యువతకు దిశా నిర్దేశం చేసారు.దేశాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత యువతపై ఎంతైనా ఉందని, డ్రగ్స్ పొగాకు మందు వంటి వ్యసనాల బారిన పడకుండా యువత చెడు మార్గంలో పయనించకుండా చూడవలసిన భాద్యత సమాజం పై ఉందన్నారు., నేను రాష్ట్రంలో మత్తు పదార్థాల నిషేధం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.ఈ కార్యక్రమం లో రాజకీయవేతలు.. తీగల కృష్ణారెడ్డి ,మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్, MBT అధ్యక్షులు అంజాదుల్లా ఖాన్ ,తెలంగాణ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ అధ్యక్షులు ఆర్ నవీన్ కుమార్, తెలంగాణ స్వామి కో కన్వీనర్ ఎస్ నర్సింగ్ రావు,స్తానిక కార్పోరేటర్ అరుణ, ప్రమోద్ ,MRPS నాయకులు తో పాటు నవ యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది .















