EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల…! భానుడి విశ్వరూపం…

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 27 :

రాష్ర్ట వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, నల్లగొండ, ఆదిలాబాద్‌, భద్రాద్రి, కొమురంభీంలలో 44 డిగ్రీలు, సిద్దిపేట, మెదక్‌, నారాయణపేట, నాగర్ కర్నూలు, సూర్యాపేట, ములుగు, కరీంనగర్ జిల్లాల్లో 43 డిగ్రీలు, ఖమ్మం, భూపాలపల్లి, హనుమకొండ, గద్వాల, సిరిసిల్ల, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌లో 43 డిగ్రీలు, రంగారెడ్డి, వనపర్తి, యాదాద్రి, మేడ్చల్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఏపీలోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర్కాపురం, నంద్యాలలో అత్యధికంగా 44 డిగ్రీలు, కడప, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 43 డిగ్రీలు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి._

Related News

Select the Topic
Scroll to Top