హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం); దిగ్గజ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ సినీ పరిశ్రమలో తన అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడినని తెలిసిన తర్వాతే తనకు సినిమా అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.















