ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 8
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్.పెద్ది కుటుంబానికి, పార్టీ తరఫున రూ. 2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం.పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయలు, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ. 25 లక్షలు ఇచ్చి అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయం.అంతటితో కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన కేసీఆర్.















