ఈతరం భారతం హైద్రాబాద్ మే 24 :
ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాపిడో, ఉబర్, స్విగ్గి, జొమాటో, జెప్టో, జియో మార్ట్ మరియు సంబంధిత బైక్ డెలివరీలను గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రద్దు చేయాలని రాష్ట్ర గవర్నర్ కు తెలుగు రాష్ట్రాల యువ నాయకులు, దక్షిణ మధ్య రైల్వే సభ్యులు కాలపు రెడ్డి సాయిబాబా విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.
గత రెండు రోజులుగా ఎండ తీవ్రత 45 నుండి 50 డిగ్రీల వరకు ఎక్కువగా ఉంది. మన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా కుటుంబ నడవిక కోసం బైక్ మీద డెలివరీ లు చేస్తున్నారు. ఇంతటి ఎండలో డెలివరీలు చేస్తున్న వారికి ఎండ దెబ్బ తగిలి వాళ్ళ ప్రాణాల మీదకి రావచ్చు. వాళ్లకు వచ్చే 100-200 రూపాయల కోసం ఈ ఎండలో తిరిగి ప్రాణాలను పోగొట్టుకుంటారు. కావున కుటుంబ పోషణ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా మనకి డెలివరీలు చేస్తున్న వారి ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రత తగ్గేవరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బైక్ మీద డెలివరీ లు రద్దు చేయాలని ఆయన ఆ లేఖ లో కోరారు. వారి నిత్యవసరాలు దృష్ట్యా ఈ సమయంలో కోల్పోయిన డబ్బులు ఎండ తీవ్రత తగ్గిన తరువాత వచ్చేలాగా ఆయా కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేయగలరు.














