EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నందమూరి జయకృష్ణ భార్య పద్మజ, కన్నుమూత!

హైదరాబాద్:ఆగస్టు 19 ఈతరం భారతం :దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది, నందమూరి తారక రామారావు, పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు.హైదరాబాద్‌ ఫిలింనగర్‌ లోని నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా, పద్మజ మరణవార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న త‌మ కుటుంబంలో విషాదం నింపింద‌ని ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు. బావ‌మ‌రిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మ‌ర‌ణించార‌ని తెలిసి దిగ్భ్రాంతికి లోన‌య్యాను. ఈ ఘ‌ట‌న మా కుటుంబం లో విషాదం నింపింది. ప‌ద్మ‌జ ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను” అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top