EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నెహ్రూ నుండి రాహుల్ గాంధీ వరకు ఓబీసీలకు కాంగ్రెస్ అడుగడుగునా ద్రోహం చేసింది

ఈతరం భారతం హైదరాబాద్ జూలై 15

“కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఓబీసీలకు చేసిందేమిటి?” పుస్తకాన్ని ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుఎన్. రాంచందర్ రావు ఆవిష్కరించారు.హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత సూరవరం శ్రీనివాస్ రచించిన “కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఓబీసీలకు చేసిందేమిటి?” పుస్తకావిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు.

బీసీ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించిన నెహ్రూ, రాజీవ్ గాంధీల అసలు నైజం బట్టబయలు అయ్యింది.ముస్లిం ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం బీసీల వాటాను దోచిపెట్టిన కాంగ్రెస్.రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తరిమికొట్టి ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’గా తీర్చిదిద్దాలని పిలుపు ఇచ్చారు.

నెహ్రూ కాలం నుండి నేటి రాహుల్ గాంధీ వరకు గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (బీసీ) సామాజిక వర్గాలకు అడుగడుగునా ద్రోహం చేశాయని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి వెనుకబడిన వర్గాల పట్ల తీవ్రమైన వివక్ష మరియు వ్యతిరేక మైండ్‌సెట్ ఉందని రాంచందర్ రావు మండిపడ్డారు. దేశ ప్రధానిగా ఉన్న సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ గారు 7 జూన్ 1961 న దేశ ముఖ్యమంత్రులకు స్వయంగా లేఖ రాస్తూ.. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకమని, మెరిట్ దెబ్బతింటుందని, కాబట్టి రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించవద్దని స్పష్టంగా పేర్కొన్నారని, ఇది పార్లమెంటు రికార్డుల్లో ఉందని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ బీసీలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుందే తప్ప వారి సామాజిక అభ్యున్నతికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

బ్రిటిష్ కాలంలో 1881 నుండి 1931 వరకు ప్రతి పదేళ్లకోసారి కులగణన జరిగేదని, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల జనాభా లెక్కల వివరాలను ఎందుకు తొక్కిపెట్టిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల కోసం మండల్ కమిషన్ నివేదిక వచ్చినప్పుడు, నాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు పార్లమెంటులో ఏకంగా రెండు గంటల పాటు ప్రసంగిస్తూ ఆ నివేదికను, ఓబీసీ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించారని సభాముఖంగా బయటపెట్టారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్ నాడు తీవ్రంగా అడ్డుకుందని గుర్తు చేశారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి వివాదాలు లేకుండా, ఉన్న రిజర్వేషన్లలో కూడా ఎవ్వరికి అన్యాయం జరగకుండా అగ్రవర్ణాలలోని పేదల కోసం 10 శాతం ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు తీసుకువచ్చి అందరికీ న్యాయం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీల పొట్ట కొట్టిందని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసం గతంలో ఆంధ్రప్రదేశ్‌లో బీసీ కోటాలోనే ముస్లింలకు 5 శాతం సబ్‌కేటగిరీ రిజర్వేషన్లు కల్పించి వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందన్నారు. బీసీ రిజర్వేషన్లలోని సబ్ కేటగిరీలో ముస్లింలను చేర్చడం ద్వారా అర్హులైన హిందూ బీసీ సామాజిక వర్గాల యువత తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కులాలను రాజకీయ అవసరాల కోసం, ఓట్ల వేట కోసం వాడుకోకూడదు. వెనుకబడిన కులాలను గుర్తించి, సామాజిక-ఆర్థిక సర్వేల ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంపొందించి సమాజంలో వారిని పైకి తీసుకురావడానికే రిజర్వేషన్లు ఉపయోగపడాలి” అని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కులాల మధ్య కుంపట్లు పెడుతోందని విమర్శించారు. బీసీల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఘనత కేవలం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత తిరస్కరించబడి ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ దిశగా సాగుతోందని రాంచందర్ రావు పేర్కొన్నారు. బీసీలకు అడుగడుగునా మోసం, ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ప్రజలంతా గ్రహించారని తెలిపారు. ఇటు రాష్ట్రాల్లోనూ బీసీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌ను తెలంగాణ గడ్డ నుండి కూడా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ‘కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ’ను తీర్చిదిద్దాలని, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

Related News

Select the Topic
Scroll to Top