Aug 10, 2025, ఈ తరం భారతం హైదరా బాద్ :తెలంగాణ : బీఈడీ కాలేజీల్లో చేరేందుకు నిర్వహించిన ఎడ్ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆదివారం జరగనుంది. అయితే ఈ ప్రక్రియ నిన్న(శనివారం)నే జరగాల్సి ఉంది. ఈసారి ఎడ్ సెట్ లో 30,944 మంది క్వాలిఫై అయ్యారు. వారిలో 17,155 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఎవరికైతే సీటు అలాటవుతుందో వాళ్లు ఈ నెల 14లోగా సదరు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు..















