EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పంబా నది పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 16:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్ప భక్తులు పంబా నది పవిత్రతను కాపాడాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మరియు శబరిమలై ఆలయం బోర్డు అధ్యక్షులు ఒక ప్రత్యేక విజ్ఞప్తిని చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల చీఫ్ సెక్రటరీలకు కూడా లేఖలు రాశారు. అయ్యప్ప భక్తులు తాము ధరించి వచ్చే సంప్రదాయ దుస్తులను పంబ నదిలో వదిలేస్తున్నారని అలా వదల కూడదని చెప్పారు . ఇలాంటి నిబంధన శాస్త్రంలో లేదని , ఎవరు చెప్పలేదని అందువల్ల అక్కడి గురువులు చెప్పే మాటలు విని పవిత్రమైన పంబా నదిలో ఆ బట్టలు వదిలేసి నది కాలుష్యానికి కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా పంబా నదికి వైరస్ భక్తులు వదిలిపెట్టే బట్టలు వల్లనే వస్తోందని అందువల్ల శాస్త్ర సమ్మతం కానీ, శాస్త్రంలో లేని ,అయ్యప్ప పూజా విధానంలో కూడా ఎక్కడా చెప్పని విధంగా అయ్యప్ప భక్తులు తమ బట్టలను నదిలో వదలవద్దని కోరారు. కొన్ని వందల ట్రక్కులు ఈ విడిచేసిన దుస్తులు ఉంటాయని కూడా పేర్కొన్నారు. ఈ విషయమై తమ రాష్ట్రంలో భక్తులకు అవగాహన కల్పించమని కోరారు..

Related News

Select the Topic
Scroll to Top