EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పరాభవ నామ సంవత్సరంలో(2026-2027) వచ్చే పండగల జాబితా విడుదల

హైదరాబాద్ జూలై 15 (ఈతరం భారతం); : రాబోయే పరాభవ నామ సంవత్సరంలో(2026-2027) వచ్చే పండగల జాబితాను తెలంగాణా విద్వత్సభ నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు అందజేసింది. పండగల విషయాల్లో ఏ విధమైన సంశయాలు, సందేహాలు లేకుండా ఉండేందుకై గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణా విద్వత్సభ ఆధ్వర్యంలో సిద్దాంతులందరూ ప్రతి సంవత్సరం చర్చించి పండగల తేదీలను నిర్ణయించి ప్రభుత్వానికి సమర్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాబోయే పరాభవ నామ సంవత్సర పండగలను దాదాపు వంద మంది సిద్ధాంతులు జూలై 13న పుష్పగిరి జగద్గురు సంస్థానంలో నిర్వహించిన విద్వత్సభ సమావేశంలో ఖరారు చేశారు. ఈ పండగల జాబితాను తెలంగాణా విద్వత్సభ కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి ఆధ్వర్యంలో కోశాధికారి ఎం. వెంకటరమణ శర్మ, సంయుక్త కార్యదర్శి కమలాకర శర్మ, సమన్వయకర్త భీంసేన్ మూర్తి, బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ సెంటర్ చైర్మన్ విజయ్ ఒద్దిరాజులు.. సీఎస్ రామకృష్ణ రావుకు అందజేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top