ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 25:
నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యులపై మరో భారం పడింది. ఇటీవలే పాల ధరలు పెరిగిన నేపథ్యంలో, ఇప్పుడు బ్రెడ్ ధర కూడా ఏకంగా రూ. 5 మేర పెరిగింది. గడిచిన ఆరు నెలల వ్యవధిలోనే బ్రెడ్ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.మైదా, గోధుమలు, చక్కెర, పాలు వంటి ముడిసరుకులతో పాటు రవాణా ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు కారణమని బేకరీ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా పాలు, బ్రెడ్ ధరలు ఎగబాకడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల రోజువారీ అల్పాహార బడ్జెట్ మరింత భారంగా మారింది.















