ఈతరం భారతం హైదరాబాద్, జూన్ 3 :
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించే దక్షిణాఫ్రికా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంసీఆర్ హెచ్ఎర్డీలో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ పాలస్ షిపొకోసా మషటైల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి తో భేటీ అయింది. ఈ భేటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..
దక్షిణాఫ్రికా-తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలను, ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను ముఖ్యమంత్రి వివరించారు. పెట్టు బడులకు సై సమావేశంలో దషటైల్ మాట్లాడుతూ… “తెలంగాణలో మా ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం పలికినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవం వేళ ప్రభుత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు. ఈ వేడుకల సందర్భంగా మీ మధ్య ఉండటం గౌరవంగా భావిస్తున్నాం. ఈపర్యటనలో శాస్త్రీయ, సాంకేతిక మరియు పెట్టుబడి సహకార రంగాల్లో మరింత విస్తృత భాగస్వామ్యాన్ని మేము ఆశిస్తున్నాం” అని వ్యాఖ్యానించారు.
“భారతదేశంలోని అత్యంత యువ రాష్ట్రాల్లో ఒకటైన కాలంలోనే భారత జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి అత్యధికంగా తోడ్పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ, అతి తక్కువ ఒకటిగా ఎదగడం అభినందనీయం. తెలంగాణ ప్రజల పట్టుదల, సృజనాత్మకత, సంకల్పానికి ఈ విజయాలు నిదర్శనం” అని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా కంపెనీలకు ఆహ్వానం
భారత్ దక్షిణాఫ్రికా మధ్య సంబంధాల విషయంలో చారిత్రక నేపథ్యాన్ని సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు వివరిస్తూ, “సాంకేతికత, ఔషధ రంగం, వ్యాక్సిన్లు, రక్షణ, ఏరోస్పేస్, పరిశోధన, విద్య, అరోగ్యం, తయారీ, నైపుణ్యాభివృద్ది, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల రంగాలలో తెలంగాణ విశిష్ట ప్రతిభను కలిగి ఉంది” అని చెప్పారు. “గ్రీన్ ఎనర్జీ, సుస్థిర అభివృద్ధి రంగాలలో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోంది. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచే అవకాశాలు ఉన్నందున తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని దక్షిణాఫ్రికా కంపెనీలను ఆహ్వానిస్తున్నాం” అని చెప్పారు.














