EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పేద వధువు వివాహానికి వెస్సో ట్రస్ట్ సహాయం

హైదరాబాద్ మార్చ్ 7 ఈతరం భారతం:

పేద వధువు వివాహానికి వెస్సో ట్రస్ట్ రూ.54 వేల సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకుంది .రిసాలా బజార్, బొల్లారం, సికింద్రాబాద్ నివాసి శ్రీ సిద్ధం దుర్గేష్ చారి వృత్తి రీత్యా కార్పెంటర్. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెల వివాహాలను అత్యంత ఆర్థిక ఇబ్బందులతో నిర్వహించారు.దురదృష్టవశాత్తు, ప్రస్తుతం ఆయనకు కాలి ఇన్ఫెక్షన్ కారణంగా తన వృత్తిని కొనసాగించలేక పోతున్నారు. ఫలితంగా కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రస్తుతం వివాహం జరగబోయే మూడవ కుమార్తె గౌతమి సంపాదించే స్వల్ప ఆదాయం పైననే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది.అదృష్టవశాత్తు, ఆయన మూడవ కుమార్తె కుమారి గౌతమి వివాహం ఎటువంటి కట్నం లేకుండా ఈమధ్యనే నిశ్చయ మయింది..వారి ప్రస్తుత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితి కారణంగా, ఈ నిరాడంబర వివాహానికి అవసరమైన ప్రాథమిక ఖర్చులు కూడా భరించే స్థోమత వారికి లేదు! వెస్సో ట్రస్ట్ గురించి తెలుసుకున్న దుర్గేష్ చారి తన కుమార్తె వివాహాన్ని గౌరవప్రదంగా నిర్వహించేందుకు ఆర్థిక సహాయం అందించమన్న అభ్యర్థన మేరకు, గౌరవ దాతల సహకారంతో, వెస్సో ట్రస్ట్ తరఫున గౌరవ దాతలు నందిగామ రాధా రాణి కృష్ణమాచారి (అమెరికా నుండి ఇండియా తిరిగి వచ్చిన ఎన్నారై) మరియు వారి తల్లి కొలవెన్ను లక్ష్మీ కమల, విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ (హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్) తమ హైదరాబాద్ వికాసపురి నివాసంలో 54000 యాభై నాలుగు వేల రూపాయల చెక్ వధువు తండ్రి దుర్గేష్ చారి కి అందజేశారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top