EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పేద విద్యార్థికి పుణ్య దంపతుల విద్యా సేవ

హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:

హైదరాబాద్ బోరబండ కు చెందిన ధరణికోట శివరామకృష్ణ(60) వృత్తి రీత్యా తెలుగు లో రైటర్. సినిమాలకు డైలాగులు వ్రాయడంతో పాటు సినిమా ఆఫర్లు లేని సందర్భాలలో రాజకీయ నాయకుల ప్రచారానికి సంబంధించి ఇతరత్రా వ్రాయడం ద్వారా వచ్చిన వారితోషికంతో తన కుటుంబ పోషణ చేస్తున్నారు. వారి ఏకైక కుమారుడు భరత్ పాలిటెక్నిక్ డిప్లమోలో ఉత్తీర్ణుడైన అనంతరం ఇబ్రహీంపట్నంలో ఉన్న ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం లో చేరి (లేటరల్ ఎంట్రీ) చదువుతున్నాడు. తండ్రి శివరామ ప్రసాద్ కు ఈమధ్య అవకాశాలు సరిగా లేక చాలీచాలని ఆదాయంతో కాలేజ్ ఫీజు చెల్లించడం కష్టమైన తరుణంలో సహాయం కొరకు వెస్సో ట్రస్ట్ ను సంప్రదించారు. వెస్సో ట్రస్ట్ ద్వారా విద్యార్థి ఆర్థిక ఇబ్బందిని తెలుసుకున్న గౌరవ దాతలు నందిగామ రాధా రాణి కృష్ణమాచారి (అమెరికా నుండి ఇండియా తిరిగి వచ్చిన ఎన్నారై) మరియు వారి తల్లి కొలవెన్ను లక్ష్మీ కమల, విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ (హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్) తమ హైదరాబాద్ వికాసపురి నివాసంలో మొదటి తడవ 15000 పదిహేను వేల రూపాయలు మరియు రెండవ తడవ 14000 పధ్నాలుగు వేల రూపాయలు, మొత్తంగా 29,000/- ఇరవై తొమ్మిది వేల రూపాయలు చెక్కుల రూపంలో విద్యార్థి భరత్ తండ్రి శివరామకృష్ణ కు అందజేశారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ వెస్సో ట్రస్ట్ సామాజిక సేవలకు విశేషముగా మద్దతు ఇస్తున్న రాధా రాణి సోదరులు కొలవెన్ను పరబ్రహ్మ సుధాకర్ మరియు Dr. నందిగామ కృష్ణమాచారి, రాధా రాణి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు

.

 

Related News

Select the Topic
Scroll to Top