ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 11:
రాష్టం లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ సూచిస్తున్న ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్క వాహన దారుడు పాటించాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకుడు సుంకుశల సంపత్ మాదిగ విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ చేసే ప్రతి వాహన దారుడు ఎడమ చేతి నుండి ఓవర్ టేక్ చేయ వద్దని, వాహనం నడిపే టప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలి, ఇతరుల ప్రాణాల మీదకు వచ్చే స్టంట్స్ చేయొద్దని, ముఖ్యం గా ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేస్తున్న వన్ వే భారీ కేడ్లను జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవింగ్ చేయాలనీ, రాంగ్ రూట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడుపారాదని,మనం ఎంత క్షేమం గా ఇంటికి వెళ్లాలని కోరుకుంటామో ఇతరుల గురించి కూడా ఆలోచించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటించ కుండ అనర్దాలు కొని తెచ్చుకోవద్దని కోరారు.















