EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రతి భర్త మరణం వెనుక భార్య..?

ప్రతి భర్త మరణం వెనుక భార్య..తెలుగు రాష్ట్రాల్లో ఇలా..!

ఇదివరకు ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది.. అని అనుకునేవాళ్లం.కానీ ప్రస్తుత కాలంలో ప్రతి మగాడి మరణం వెనుక ఓ ఆడది కొద్దో గొప్పో కారణం కాకుండా ఉండదని తెలుస్తోంది.భర్తలను చంపేస్తున్న భార్యలు.. ఇప్పుడో కొత్త ట్రెండ్ గా మారిపోయింది.

ప్రియుడిని మర్చిపోలేకే భార్యలు ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులిస్తున్నవాళ్లూ అధికంగానే ఉంటున్నారు. అయితే కొందరు మాత్రం ఏకంగా భర్తలకే స్పాట్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదో ట్రెండ్ గా మారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పెళ్లంటేనే యువత పారిపోతోంది.

గతంలో పెళ్లంటే నూరేళ్ల పంట అని అనేవాళ్లు పెద్దలు. కానీ ఇప్పుడు పెళ్లంటే మూణ్ణెళ్ల ముచ్చటగా మారిపోయింది. అటు సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల వరకూ ఎగబడి మరీ విడాకులు తీసుకుంటున్నారు. గతంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అధికంగా ఉండేవి.. ఇప్పుడు లవ్ మ్యారేజ్ లు ఎక్కువై పోయాయి. దీంతో విడాకులు, మరణాలు కూడా ఆ రేంజ్ లోనే జరుగుతున్నాయి.అయితే తాజాగా జాతీయ నేర గణాంకాల రికార్డు ప్రకారం భార్య చేతిలో చనిపోయిన భార్తల మరణాల్లో ఉత్తర్ ప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. యూపీలో గతేడాది 62 మంది భర్తలు భార్యల చేతిలో మరణించగా.. ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బిహార్ లో 42 మంది, రాజస్థాన్ లో 25 మంది, మధ్య ప్రదేశ్ లో 22 మంది భర్తలు భార్యల కారణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

యూపీలోని మీరట్ లో సౌరభ్ కుమార్ ను తన భార్య ముస్కాన్ లవర్ సాయంతో లేపేసింది. ఆ తర్వాత భర్త డెడ్ బాడీను ముక్కలు ముక్కులుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్ తో కప్పేసింది. ఇక మేఘాలయా మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత అమీన్ పుర్ లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఇక తెలంగాణలో జరిగిన తేజేశ్వర్ హత్య కేసు వ్యవహారం కూడా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Related News

Select the Topic
Scroll to Top