EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రధాన రహదారులపై జంట నగరాల్లో నెలకొన్న ఇంధన సెగ ప్రభావం

హైదరాబాద్ మార్చ్ 25 ఈతరం భారతం :

జంట నగరాల్లో నెలకొన్న ఇంధన సెగ ప్రభావం కేవలం నగరం లోపలే కాకుండా ప్రధాన రహదారులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బంకుల వద్ద వాహనాల క్యూలైన్లు ప్రధాన రోడ్లపైకి రావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఇంధన కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న సందేహాల కారణంగా బంకుల వద్ద ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పలు మెట్రో నగరాల్లోని పలు బంక్‌ల్లో నోస్టాక్ అన్న బోర్డులు దర్శనమిస్తుండడం విశేషం.

 

 

Related News

Select the Topic
Scroll to Top