EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వాలు, మహిళలు వివక్షత నిర్మూలనకు, సమాన హక్కులు సాధించుకోవడం కోసం కృషి చేయాలి     అరణ్య అగ్రికల్చరల్ కో ఫౌండర్ అండ్ సీఈవో పద్మ కొప్పుల

హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:

అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ల సంయుక్త ఆద్వర్యం లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జి రాధా రాణి ముఖ్య అతిదిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా అరణ్య అగ్రికల్చరల్ కో ఫౌండర్ అండ్ సీఈవో పద్మ కొప్పులమాట్లాడుతూ “మహిళలు సాధించిన పురోగతిని బట్టే దేశం యొక్క పురోగతిని కొలుస్తాను”అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేసారు. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని “మహిళల, బాలికలందరి హక్కులు, న్యాయం, కార్యాచరణకు” అంకితం చేసింది. ప్రపంచం మొత్తం మీద ఇప్పటికీ అనేక ప్రాథమిక అంశాలైన ఉద్యోగం, ఆర్థికపరమైన, రక్షణ, కుటుంబ, ఆస్తి, సంచారం (,వ్యాపారం, పదవీ విరమణ లాంటి అంశాలలో పురుషులతో పాటు సమాన హక్కులు లేవు. సాంఘిక పరమైన కట్టుబాట్లు, వివక్షత తో కూడిన చట్టాల రూపంలో మహిళలు, బాలికలు అభివృద్ధి లో అడ్డంకులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఐక్యరాజ్య సమితి “మహిళల స్థితి గతులను అధ్యయనం” చెయ్యటానికి ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ (CSW 70) ప్రభుత్వాలు, పౌర సమస్యల మీద పనిచేసే సంస్థలు మహిళలు వివక్షత నిర్మూలనకు, సమాన హక్కులు సాధించుకోవడం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చింది.అనంతరం ఉమెన్ సబ్ కమిటీ ఏఆర్ ఆర్ బి ఈ ఎస్ కన్వీనర్ ఎన్. మీనా తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రతాపరెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకట్రామయ్య ,ఏపీ టి ఆర్ ఆర్ బి ఈ ఏ ప్రెసిడెంట్ బి రవికాంత్, ఏ ఐ ఆర్ ఆర్ బి ఈ సెక్రటరీ జనరల్ ఎస్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు మహిళా దినోత్సవాన్ని విశిష్టతను వివరించారు.1.. మహిళల హక్కుల కోసం, రక్షణకోసం ఐక్యంగా కృషి చెయ్యాలి, విధాన నిర్ణయ వేదికలలో, యూనియన్ కార్యకలాపాలలో మహిళలను ప్రోత్సహించాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపులను నిరోధించాలని, మహిళా ఉద్యోగుల పోస్టింగ్, బదిలీలలో ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు చెయ్యాలని,సౌకర్యం కల్పించాలని,. అన్ని ఆఫీసులు శాఖలలో శాఖలలో మహిళలకు ప్రత్యేక రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించాలని, పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో 33 శాతం మహిళలకు కేటాయింఛి అమలు చెయ్యాలి. కమిటీలను ఏర్పాటు చెయ్యాలి,POSH చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని వక్తలు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు యూనియన్లతో మహిళా దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో క్రాంతి కుమార్ మక్కాడ్ అధ్యక్షులు ఆఫీసర్స్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి ఆఫీస్ అసోసియేషన్ అశోక్, పి వేణు రావు అధ్యక్షులు ఎంప్లాయిస్ యూనియన్, ఏ బాబు ప్రధాన కార్యదర్శి ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ ప్రకాశం సిసి ఏ ఐ ఆర్ ఆర్ బి ఏ కె భిక్షమయ్య, సిసి నెంబర్ రమేష్ భూపాల్, సతీష్ అధ్యక్షులు బి ఎఫ్ ఎఫ్ ఐ , ఉమెన్స్ ప్రతినిధి హరీఫా ,కీర్తి శాలిని, భార్గవి, దివ్య, శిల్ప, శైలజ, నిరోషా, తోపాటు తెలంగాణలోని 17 రీజియన్ల నుండి సుమారు 500 మంది పైగా మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top